తిమ్మాపూర్: హైదరాబాద్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈనెల 13న ఎడునెట్ ఫౌండేషన్, టాస్క్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శాప్‌కోడ్ ఉన్నతి ఇన్నోవేషన్ మారథాన్ 2025–26 లో జ్యోతిష్మతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగింది. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మారథాన్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తె లంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి మొత్తం 560 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..109 టీంలు క్వార్టర్ ఫైనల్‌కు ఎంపికయ్యాయి. వాటిలో 64 టీంలు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. చివరగా 29 టీంలు ఫైనల్ రౌండ్‌కు ఎంపికయ్యాయి. తుది ఫలితాలలో జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు షేక్ జోహైబ్ ఉర్ రహ్మాన్, పనుగంటి వర్షిణి విజేతలుగా నిలిచారు. ప్రాజెక్ట్ వినూత్నత , ఆచరణాత్మక ఉపయోగం కారణంగా ప్రత్యేకంగా నిలి చింది. ఈ సందర్భంగా జ్యోతిష్మతి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు , సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్‌సాయి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ టి. అనిల్ కుమార్, డీన్ (అకాడెమిక్స్) పీకే వైశాలీ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


