జగిత్యాలటౌన్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశారదన్ మహారాజ్ నాయకత్వంలో కాన్షీరాం కలలు కన్న బహుజన రాజ్యాన్ని సాధిస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీకాంత్‌గౌడ్, దువ్వాక శివ, ముసిపట్ల లక్ష్మీనారాయణ, సల్లూరి రాజగౌడ్, జలజ, లక్ష్మి పాల్గొన్నారు.
ఇఫ్తార్‌తో సోదరభావం పెంపు
కోరుట్ల: ఇఫ్తార్ విందులు సోదరాభావం పెంపొందిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 14 వవార్డులో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిఒక్కరూ ప్రేమ, అభిమానం పంచుకోవాలన్నారు.


