మైతాపూర్ రోడ్‌లోని ఓపెన్‌వెల్ వద్ద డీఆర్‌సీసీ కేంద్రం నిర్మిస్తే పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయి. అంతేకాకుండా నీరంతా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సెంటర్ నిర్మిస్తే రైతుల పక్షాన ఉద్యమిస్తాం.
– పడాల శ్రీను, రైతు
ఉద్యమం చేస్తాం
డీఆర్‌సీసీని బావి పక్కన నిర్మిస్తే పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడతా రు. చెరువు నీరు కలుషితమై రైతుల పంట పొలాలు దెబ్బ తింటాయి. డీఆర్‌సీసీ ప్రతిపాదనను నిలిపివేయాలి. లేకుంటే బీజేపీ పక్షాన ఉద్యమిస్తాం.
– కల్లెడ ధర్మపురి, బీజేపీ ఫ్లోర్ లీడర్


