అంజన్నకు మొక్కులు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్రపాలకుడు బేతాళస్వామి ఆలయం, శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక అభిషేకాలు చేశారు. భక్తుల ప్రత్యేక దర్శనాలు, వాహన పూజలు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.12.57లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో శ్రీకాంత్‌రావు, ఏఈవో హరిహరనాథ్ పర్యవేక్షించారు.


