గణపయ్యకు పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతి ఆలయంలో మంగళవారం అంగారక సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌కుమార్ మంత్రోచ్ఛారణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పము నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తదితరుల పాల్గొన్నారు.


