ఘనంగా జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
జగిత్యాలటౌన్: మాజీమంత్రి జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి జంబిగద్దె ప్రాంతంలోని ఆంజనేయస్వామి, మార్కండేయ ఆలయాల్లో పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జీవన్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలు, కేరింతల మధ్య జీవన్‌రెడ్డిని భారీ క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు. పూల వర్షం కురిపించారు. జీవన్‌రెడ్డిపై యువజన కాంగ్రెస్ రూపొందించిన పాట సీడీనీ ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి 75 కిలోల భారీ కేక్‌కు కట్‌చేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్త మోహన్, కల్లెపల్లి దుర్గయ్య, విజయలక్ష్మి, బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ముంజాల రఘువీర్‌గౌడ్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు.
కొండగట్టులో ప్రత్యేక పూజలు
మల్యాల: ముందుగా జీవన్‌రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, నాయకులు ఉన్నారు.


