మైలారం మల్లన్న జాతరలో విప్ ఆది శ్రీనివాస్
మేడిపల్లి: మండలంలోని కాచారంలో మైలారం మల్లన్న జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోనమెత్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. సర్పంచ్ చిట్యాల హైమావతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేశ్, వెంకట్రావుపేట సర్పంచ్ కానుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మల్లన్నకు బోనాలు
కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల గ్రామంలో ఆదివారం మల్లికార్జునస్వామికి బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం బోనాలతో గ్రామం నుంచి ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మైలారం మల్లన్న జాతరలో విప్ ఆది శ్రీనివాస్


