రాయికల్ బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగరాలి
రాయికల్: రాయికల్ బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాయికల్‌ను మున్సిపాలిటీగా చేశామని. అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన రెండేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని, కౌన్సిలర్ల గెలుపునకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌లు మారంపల్లి రాణి, ఎనుగందుల ఉదయశ్రీ, మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, మారంపెల్లి సాయికుమార్, శ్రీరాములు సత్యనారాయణ, మహేశ్ గౌడ్, కో–ఆప్షన్ మాజీ సభ్యురాలు వనితసోహెల్, నాయకులు పాల్గొన్నారు.


