‘గంగనాల’కు నీరు విడుదల చేయండి
ఇబ్రహీంపట్నం: సదర్‌మాట్ నుంచి గంగనాల ప్రాజెక్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయకట్టు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. మూలరాంపూర్ శివారులో గోదావరిపై నిర్మించిన సదర్‌మాట్ ప్రాజెక్టు నుంచి గంగనాలకు నీరు విడుదల చేయాలని ధర్నా చేశారు. గంగనాల కింద వేములకుర్తి, యామపూర్, ఫకీర్‌కొండాపూర్, మల్లాపూర్ మండలం దామ్‌రాజ్‌పల్లి, నడికుడ, మొగిలిపేట గ్రామాల్లోని సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, సదర్‌మాట్ నిర్మాణం పూర్తయ్యిందని, గేట్లు వేసి గంగనాలకు విడుదల చేయకపోవడంతో పొలాలకు నీరు చేరడం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంకా నార్లు కూడా పోసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గంగనాలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాజెక్టు ఏఈ కవితకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వేములకుర్తి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుమ్మల గంగన్న, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌లోని గంగనాల ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.


