కోర్టు సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి
జగిత్యాలజోన్: న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచడంలో కోర్టు సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సూచించారు. జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. క్యాలెండర్, డైరీలు ఆవిష్కరించారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిజాయితీగా పనిచేసే సిబ్బందికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారా యణ, సబ్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె. వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కె.నిఖిషా, జ్యూ డిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అ ధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్, కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎన్.శ్రీనివాస్, మీర్జా షఫీయోద్దిన్ బేగ్ పాల్గొన్నారు.


