కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూజలు
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించా రు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీటీడీ బోర్డు మంజూరు చేసిన రూ.35.19కోట్లతో నిర్మించే 96గదుల సముదాయం, దీక్ష విరమణ మంటపానికి భూమిపూజ చేశారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పవన్‌కు వినతిపత్రం సమర్పించారు. పవన్ రాకతో భక్తులు మూడు గంటలపాటు ఇబ్బంది పడ్డారు. జేఎన్టీయూ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ తరలివెళ్లారు. కార్యక్రమంలో దేవా దాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.


