బీసీల పాలిట రాబందు.. రేవంత్‌రెడ్డి
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో బీసీలకు బందువు కేసీఆర్ అయితే.. రేవంత్‌రెడ్డి మాత్రం రాబందుగా మారారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ పాలనలో బడుగు, బలహీనవర్గాల మహనీయులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని, విగ్రహాలను అలంకరించేవారమని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలంకరణ చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌నాయక్, వొల్లం మల్లేశం, దయాల మల్లారెడ్డి, రాగుల రాజు, కిశోర్, రాము, అనురాధ, శ్రీనివాస్, వేణు, గంగాధర్, భగవాన్, వెంకటేశ్ పాల్గొన్నారు.


