మెరుగైన సేవలు అందించాలి
జగిత్యాలరూరల్: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం బీర్‌పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెక్షన్ 22ఏ అమలు పరిస్థితి, మైనర్ ఇరిగేషన్ సర్వే (బోర్లు, బావులు) సర్వే ప్రగతి, ఓటరు లిస్ట్ మ్యాపింగ్, కొత్త ఓటర్ల ఆడిట్ ప్రక్రియ, గ్రామాల వారీగా జీపీవోలో నమోదైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితమైన డేటా నమోదు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ సుజాత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


