సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులకు సహకరించాలి
కథలాపూర్: సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలని కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి కోరారు. కథలాపూర్ రైతు వేదికలో శుక్రవారం దుంపేట, చింతకుంట గ్రామాల భూనిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు కాలువ పనులకు సర్వే పూర్తయిందని, భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తామన్నారు మార్కెట్ ధర కంటే రెట్టింపు డబ్బులు ఇవ్వాలని పలువురు రైతులు కోరగా ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలి పారు. తహసీల్దార్ వినోద్, సర్పంచ్ నాగం భూమ య్య, ఆర్‌ఐలు నాగేశ్, రవీందర్ పాల్గొన్నారు.


