గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి గురువారం భూమిపూజ చేశారు. గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఎంపీ అర్వింద్ సహకారంతో రోళ్లవాగుకు గేట్ల బిగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీకి స్థలం ఇస్తున్నట్లు సర్పంచ్ రాజగోపాల్‌రావు ఎమ్మెల్యేకు అఫిడవిట్ సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖ డీఈ మిలింద్, ముప్పాల రాంచందర్‌రావు, ఉపసర్పంచ్ శీలం లింగన్న పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలానికి చెందిన 83 మందికి ఇళ్ల ప్రొసీడింగ్‌లు పంపిణీ చేశారు. జగిత్యాల రూరల్ మండలానికి 794 ఇళ్లు మంజూరయ్యాయని, 529 పనులు సాగుతున్నాయని, 408 ఇళ్ల లబ్ధిదారులకు వారివారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. మండల ప్రత్యేకాధికారి నరేశ్, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


