మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ● పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం
మెట్‌పల్లి రూరల్: మున్సిపల్ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు. మెట్‌పల్లి పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకుల, కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. బల్దియాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పట్టణాల్లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి వార్డులోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు.


