ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి

Nov 29 2025 6:59 AM | Updated on Nov 29 2025 6:59 AM

ఎయిడ్

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి

జగిత్యాల: ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మెడికల్‌ కళాశాలలో విద్యార్థులకు ఎయిడ్స్‌ వ్యాధిపై క్విజ్‌ కాంపిటిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఎయిడ్స్‌ నివారణకు సంబంధించిన ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. అనంతరం క్విజ్‌ కాంపిటిషన్‌లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఎయిడ్స్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

పురుషులు కు.ని. చేయించుకోవాలి

పురుషులు కుటుంబ నియంత్రణ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సర్జన్‌ డాక్టర్‌ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో 17 కు.ని. ఆపరేషన్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకన్నా పురుషులే చేయించుకుంటే ఆరోగ్యకరమన్నారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, డెప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

వృద్ధుల కోసమే జెరియాట్రిక్‌ వైద్యసేవలు

జగిత్యాల: వయోవృద్ధుల కోసమే జెరియాట్రిక్‌ వైద్యసేవలు ఏర్పాటు చేయడం జరిగిందని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి నరేశ్‌ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో జెరియాట్రిక్‌ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీనియర్‌ సిటిజన్లకు డయాబెటిస్‌, రక్తపోటు, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలు, పక్షవాతానికి ఉచితంగా చికిత్స పొందవచ్చన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, ఆర్‌ఎంవో విజయ్‌, రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి, హన్మంతరెడ్డి, యాకూబ్‌ పాల్గొన్నారు.

శిశు మరణాలు తగ్గించాలి

జగిత్యాల: శిశు మరణాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాతాశిశు సంరక్షణాధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంసీహెచ్‌లో నవజాత శిశువుల సంరక్షణపై సంకల్ప శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ సంరక్షణ చర్యల్లో భాగంగా సీ్త్రలకు కౌమార దశ నుంచి వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వైవాహిక జీవితం గర్భాధారణ సమయంలో ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. గర్భాధారణ జరిగిన 12 వారాల్లోపు తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ధనుర్వాసం రాకుండా టెటానస్‌ డిప్తిరియా 1, 2 డోస్‌లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ అరుణకుమారి, సాయిచరణ్‌ పాల్గొన్నారు.

డిపోల నుంచి మద్యం కొనాలి

జగిత్యాలక్రైం: జిల్లాలో 2025–27 సంవత్సరానికి గాను మద్యంషాపుల నిర్వహణకు లైసెన్స్‌ పొందినవారు ఈనెల 29 నుంచి తమకు కేటాయించిన రిటైలర్‌ కోడ్‌ ద్వారా డిపోల నుంచి మద్యం కొనాలని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త దుకాణదారులు తమకు కేటాయించిన దుకాణాల్లో మద్యం విక్రయాలు చేపట్టాలన్నారు.

కోటిలింగాల హుండీ లెక్కింపు

వెల్గటూర్‌: మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. కార్తీకమాసం ముగిసిన సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ పూదరి రమేశ్‌ ఆధ్వర్యంలో హుండీ లెక్కించగా రూ.2,73,695 ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజమౌళి, ధర్మకర్తలు గుమ్ముల వెంకటేశ్‌, రవి, లావణ్య, అర్చకులు నాగరాజుశర్మ, సంజీవ్‌శర్మ, వెల్గటూర్‌ సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై    అవగాహన కల్పించాలి1
1/2

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి

ఎయిడ్స్‌పై    అవగాహన కల్పించాలి2
2/2

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement