విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

జగిత్యాల: విద్యార్థులు నైపుణ్యం అభివృద్ధి చేసుకోవాలని శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుజాత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) కళాశాలలో రెండురోజులుగా నిర్వహిస్తున్న ఎన్జీవో, అభివృద్ధి రంగంపై అవగాహన అంశంపై మాట్లాడారు. ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కమ్యునికేషన్‌ స్కిల్స్‌ ఎంతో ముఖ్యమని, టెక్నాలజీ, పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు అవసరమన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా గ్రామీణ సమస్యలను కూడా అర్థం చేసుకోవాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలపై ఆధ్యయనం చేయాలన్నారు. ప్రిన్సిపాల్‌ అశోక్‌, ప్రొఫెసర్‌ శ్రీధర్‌, శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, ఎన్‌సీసీ ఆఫీసర్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement