కథలాపూర్: క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే బీజేపీకి బలమని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో కార్యకర్తలకు మంగళవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వ్యక్తిగతం కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శిక్షణ తరగతులతో కార్యకర్తల్లో చైతన్యం వస్తుందని, పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. వక్తలు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు నరెడ్ల రవి, కథలాపూర్ మహేశ్, ఆరె శివ, ఆనంద్‌రెడ్డి, సత్యం, శ్రీనివాస్, మహేశ్, నవీన్, రాజం తదితరులు పాల్గొన్నారు.


