విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలి
మల్లాపూర్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌పర్సన్ సి.రత్నపద్మావతి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మెట్‌పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞానసదస్సులో మాట్లాడారు. దేశంలోని ప్రతి పౌరుడికీ రాజ్యంగం హక్కులు కల్పించిందని, భంగం కలిగినపుడు కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. చట్టాలతో నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించలేమని, ప్రజల్లో చైతన్యంతోనే ఆరికట్టవచ్చని పేర్కొన్నారు. జిల్లా, మండల న్యాయ సహాయ కేంద్రాలను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించడం బాధ్యత అని, నిర్లక్ష్యం చేస్తే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. మోడల్ స్కూల్‌కు వచ్చే రోడ్డు, హైలెవల్ వంతెన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తి సుగాలి నారాయణ, మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్‌రావు, మెట్‌పల్లి, కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జిలు నారం అరుణ్‌కుమార్, కాసుల్ల పావ ని, మెట్‌పల్లి, కోరుట్ల బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్‌రెడ్డి, విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు పసునూరి శ్రీనివాస్, కొంపెల్లి సురేశ్, డీఈవో రాము, మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమేశ్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్, తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంఈవో దామోదర్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుగా వాల్గొండ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధా న న్యాయమూర్తి సందర్శించారు. స్వా మివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
లోక్ అదాలత్‌కు సహకరించాలి
జగిత్యాలజోన్: డిసెంబర్ 13న నిర్వహించే లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి పోలీసులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి కోరారు. జిల్లా కోర్టులో శనివారం పోలీసులతో సమీక్షించారు. రాజీకి అనుకూలమైన కేసులన్నీ పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ప్రి న్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అ దనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, పీపీ రాజే శ్, డీఎస్పీ రాములు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


