నిధులు మంజూరు చేయాలని వినతి
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని కండ్లపల్లి, చల్‌గల్, మోతె చెరువుల మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీత విద్యాలయం స్కూల్ లీజు 50 ఏళ్లు పూర్తయిందని, పాఠశాల హాస్టల్ ఉన్నందున లీజు పొడిగించాలని కోరారు. చల్‌గల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 25 ఎకరాలు, మినీస్టేడియం కోసం 10 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.


