కన్యకాపరమేశ్వరికి పూజలు
సారంగాపూర్: మండలంలోని పెంబట్ల శ్రీవాసకన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం భక్తులు పూజలు చేశారు. జిల్లాకేంద్రం నుంచి ఆర్యవైశ్యులు చేపట్టిన ఆధ్యాత్మిక పాదయాత్ర ఎనిమిది కిలోమీటర్లు సాగింది. యాత్రంలో దేవతల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాభిషేకం, కోటిదిపోత్సవం చేపట్టారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉసిరి చెట్టు కింద భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు మర్యాల రాజన్న, వావిలాల శేఖర్, యాసల మల్లికార్జున్, గుండ సురేష్, గంప శ్రీనివాస్, యాంసాని సంతోష్, రాజేశుల శ్రీనివాస్, మర్యాల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.


