వనభోజనాలతో అనుబంధాల పెంపు
ధర్మపురి: కార్తీకమాసంలో వనభోజనాలతో కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయని ధర్మపురికి చెందిన ప్రముఖ పురోహితులు జన్మంచి వంశీకృష్ణ అన్నారు. మిత్ర–99 ఎస్సెస్సీ బృందం ఆధ్వర్యంలో నేరెళ్ల అటవీప్రాంతంలోని సాంబశివ ఆలయ ఆవరణలో ఆదివారం కార్తీక వనభోజనాలు చేశారు. ముందుగా శివాలయంలో మిత్రబృందం సభ్యులంతా ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక వనభోజనాల ప్రాముఖ్యత, శాసీ్త్రయతను వంశీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో మిత్రబృందం సభ్యులంతా ఆటపాటలతో సందడి చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాజాల రవీందర్, సభ్యులు పైడి మారుతి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్, వ్యవస్థాపక అధ్యక్షుడు చిలువేరి కిరణ్, గౌరవ అధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ పాల్గొన్నారు.


