‘పీఎంశ్రీ’ కేంద్రాలు ఉపసంహరించుకోవాలి
జగిత్యాలటౌన్: నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపి) అమలులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేయతలపెట్టిన పీఎంశ్రీ మోబైల్ అంగన్వాడీ కేంద్రాల కారణంగా ఐసీడీఎస్ మూతపడే ప్రమాదం ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధం అంగన్‌డీ యూనియన్ జిల్లా మూడో మహాసభలు జిల్లా అధ్యక్షురాలు రజిత అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎల్‌జీ గార్డెన్స్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య చట్టం అమలైతే ఐసీడీఎస్ స్వతంత్య్రంగా ఉండదని, అనేక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అంగన్వాడీ టీ చర్లు, హెల్పర్లు ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చే శారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి, సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందూరి సులో చన, కోమటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


