మున్సిపల్‌ జాగాపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ జాగాపై పట్టింపేది?

Nov 8 2025 7:50 AM | Updated on Nov 8 2025 7:50 AM

మున్స

మున్సిపల్‌ జాగాపై పట్టింపేది?

● కబ్జా కోరల్లో బల్దియా స్థలాలు ● జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా ఆక్రమణ ● రేకులషెడ్లు నిర్మిస్తూ వ్యాపారం

జగిత్యాల: మున్సిపాల్టీల్లో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టినా, సెట్‌బ్యాక్‌ లేకున్నా సంబంధిత అధికారులు కూల్చివేస్తుంటారు. కానీ, మున్సిపల్‌ స్థలాలు కబ్జా చేస్తే మాత్రం స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. పట్టణాల్లో అద్దెకు దుకాణాలను తీసుకుని దాని ఎదుట మరో దుకాణమంతా స్థలాన్ని రేకుల షెడ్లతో కబ్జా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు.

కరువైన పర్యవేక్షణ

జిల్లా కేంద్రంలో ఇటీవల వ్యాపారాలు పెరిగాయి. దీంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనా లు నిర్మించడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, డ్రెయినేజీలపై కప్పులు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. పలుచోట్ల మున్సిపల్‌ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు.

ఆదాయానికి గండి

ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అధికారులు, పాకలవర్గాలు పట్టించుకోకపోవడంతో బల్దియా ఆదాయానికి గండి పడుతుంది. గతంలో అంగడిబజార్‌లో ఉన్న ఖాళీ స్థలలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే ఒక్కో షాపును రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. అలాగే ఉద్యానవనానికి సంబంధించి కొత్తబస్టాండ్‌ వైపు కాకుండా మరో వైపు కాంప్లెక్స్‌ నిర్మించడంతో టెండర్ల ద్వారా మున్సిపల్‌కు అధిక ఆదాయం వచ్చింది. కొత్తబస్టాండ్‌ ముందున్న స్థలంలో సైతం భవనం నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయల విలువ గల స్థలాల్లో ఆక్రమణలను తొలగించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే బల్దియాకు మరింత ఆదాయం సమకూరనుంది. కానీ, మున్సిపల్‌ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కాగా, కొన్ని చోట్ల షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించినా ఆశించిన మేర నిర్మాణాలు చేపట్టలేదు.

నామమాత్రపు చెల్లింపులు

మున్సిపల్‌ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకుని అందులో వ్యాపారం నిర్వహించేవారు ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బల్దియా అధికారులు సైతం ఫీజులు తీసుకుని మిన్నుకుంటున్నారు. కాగా, అక్రమంగా షెడ్లు వేసినవారు మాత్రం మున్సిపల్‌కు నామమాత్రంగా ఫీజులు చెల్లించి, వేరేవారికి కిరాయి ఇస్తూ అధిక మొత్తంలో అద్దె తీసుకుంటున్నారు. అధికారులు చొరవ చూపి విలువైన స్థలాల్లో ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్‌ నిర్మించాలని, అర్హులైన వ్యాపారులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

షటర్ల ముందు షెడ్లు

పట్టణంలోని రోడ్ల వెంట షటర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని ఆనుకుని మరో షటర్‌ అంతా రేకులషెడ్డు వేసి సామగ్రి పెడుతుండడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజ లు నడిచేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా టవర్‌సర్కిల్‌, తహసీల్‌ చౌరస్తా, కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. ఇటీవల నూతనంగా షాపింగ్‌మాల్స్‌ వెలువగా వారు సైతం ట్రాఫిక్‌కు సంబంధించినవి ఏర్పాటు చేసుకోకపోవడంతో వాహనాలు పెట్టుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అలాగే జిల్లాలోని పెద్ద మున్సిపాల్టీ కోరుట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

మున్సిపల్‌కు సంబంధించిన స్థలాల్లో ఎలాంటి ఆక్రమణలు చేపట్టరాదు. విలువైన స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌, టీపీవో, జగిత్యాల

చర్యలు తీసుకుంటాం

మున్సిపల్‌ జాగాపై పట్టింపేది?1
1/1

మున్సిపల్‌ జాగాపై పట్టింపేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement