డీజీపీని కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల: నూతనంగా నియామకమైన డీజీపీ శివధర్‌రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
జగిత్యాల: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలలో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలి
జగిత్యాల: రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ హక్కు ల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి కమి షన్ ఏర్పాటు చేయాలని టస్కా రాష్ట్ర అధ్యక్షు డు నర్సింహారావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. సీనియర్ సిటిజన్స్ కోసం శాఖ ఏర్పాటు చేయాలని, బస్సుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హరి అశోక్‌కుమార్, కార్యదర్శి వి శ్వనాథ్, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, అశోక్‌రావు, కోశాధికారి ప్రకాశ్‌రావు, ఆర్గనైజింగ్ కా ర్యదర్శి కరుణ, సంయుక్త కార్యదర్శులు విఠల్, యాకూబ్, కార్యవర్గ సభ్యులు రాజా గోపాలచారి, గంగారాం, దుబ్బేశం, స్వామి, గంగారెడ్డి, నాయిని సంజీవరావు ఎన్నికయ్యారు.
అధికారుల విచారణకు ముందుంటాం
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద 138 సర్వేనంబరులోని 20 గుంటలకు సంబంధించి కీబాల విక్రయ పత్రం ద్వారా కొనుగోలు చేసిన అంశంపై విచారణకు ముందుంటామని పెట్రోల్‌బంక్ నిర్వాహకుడు మంచాల కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అధికారులు విచారణ, పరిశీ లన కూడా చేస్తున్నారని, తాము అడ్డుకోలేదని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ప్రజల్లోకి వెళ్లినప్పుడు అధికారులు విచారిస్తున్నారని, కాగా, ఈ సర్వేనంబరుపై అనేక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 74 ఏళ్ల క్రితం మున్సిపల్ ద్వారా కొనుగోలు చేసిన ఈ భూమిని రూ.100 కోట్ల ఆస్తి అక్రమమని ప్రజలను తప్పుదోవ ప ట్టిస్తున్నారని పేర్కొన్నారు.ఆయన వెంట గొల్ల పల్లి లక్ష్మణ్‌గౌడ్, రమేశ్, దారం గోపి ఉన్నారు.
డీజీపీని కలిసిన ఎమ్మెల్యే


