
ఐక్యరాజ్య సమితిలో భారత కీర్తి
రామగుండం: ప్రపంచ శాంతిపరిరక్షణలో భారతదేశం పోషిస్తున్న కీలకపాత్ర గురించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. సమితిలో భారత్ తమ కీర్తిని చాటుకోవడం, వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, సమర్థత వంటి అంశాలపై సమావేశంలో పలు సూచనలు, సలహాలిచ్చే అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాల గురించి ఆయన శ్రీసాక్షిశ్రీతో పంచుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో భారతదేశ స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు అవకాశం లభించిందన్నారు. తనతో పాటు అడ్వయిజరీ కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ (ఏసీఏబీక్యూ) చైర్‌పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్(ఫైనాన్స్ అండ్ బడ్జెట్ కంట్రోలర్) చంద్రమౌళి రామనాథన్‌తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించానని ఎంపీ వివరించారు.