
కలప పట్టివేత
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో సుమారు రూ.లక్ష విలువైన టేకు కలపను శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రంలోని గసికంటి గంగారెడ్డి ఇంట్లో టేకు కలప అక్రమంగా నిలువ ఉంచారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 32 దుండలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేములవాడ అటవీశాఖ కార్యాలయం డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్రరావుకు అప్పగించారు. పట్టుకున్న కలపను కొలతలు వేసి వాటి విలువను శనివారం వెల్లడిస్తామని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. టాస్క్‌పోర్స్ పోలీసుల దాడులతో కలప స్మగ్లర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.