
రా అన్నా.. కలిసుందాం
అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం.
– తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్)
తమ్మీ రారా..
నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారం

రా అన్నా.. కలిసుందాం