సామూహిక సాయుధ లొంగుబాటుతో ఆశలు అజ్ఞాతంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు కన్నుమూసిన కన్నవాళ్లు ‘అడవిలో అన్నల’ సోదరుల నిరీక్షణ
సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది.
27 ఏళ్ల కిందట అడవిబాట
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్ రాకపోవడం విషాదం.
పోలీస్ కౌన్సెలింగ్‌తోనే వెలుగులోకి...
శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపల్లిలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా్వాత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు.
నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు.
మావోళ్లు వస్తారో !