
రాజీవ్ రహదారిపై కారు దగ్ధం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి కారు దగ్ధమైంది. వివరాలు.. మంచిర్యాలకు చెందిన నాగరాజు తన కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఎన్టీపీసీ బీ–గేట్ ఎదుట రాజీవ్ రహదారిపై డివైడర్‌కు ఢీకొంది. ఈ క్రమంలో కారులో మంటలు లేచాయి. ఇంజిన్‌లో ఏర్పడిన మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. కారులో ఉన్నవారు గమనించి వెంటనే కిందకు దిగి స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.