
ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం
ధర్మపురి: విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసిన ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డిని బుధవారం రాత్రి ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించిన ప్రశంసాపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన వినాయక, దుర్గా నవరాత్రోత్సవాలు, దసర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి చర్యలు చేపట్టిన సీఐని అభినందించారు.
సర్వేకు సహకరించాలి
జగిత్యాల: ప్రజల జీవన స్థితిగతులపై జగిత్యాల పట్టణంలో జాతీయ గణాంక శాఖ సర్వే చేపట్టనున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం సర్వేకు సంబంధించిన కరపత్రాలను కమిషనర్ స్పందనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా కుటుంబాలను ఎంపిక చేస్తూ కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హతలు, తదితర వివరాలు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది సహకరించాలని కోరారు.
అందరూ తమ కళ్లను ప్రేమించాలి
జగిత్యాల: అందరూ తమ కళ్లను ప్రేమించాలని, సెల్‌ఫోన్లకు బానిస కావొద్దని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కంప్యూటర్, సెల్‌ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తే దృష్టిలోపం ఏర్పడుతుందన్నారు. ఆరుబయట గడిపే సమయాన్ని పెంచుకోవాలని, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు, పోషకాహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని, షుగర్ వ్యాధి ఉన్న వారు తప్పకుండా రెటినా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ కృష్ణ, ఆర్‌ఎంవో గీతిక, డీపీవో రవీందర్ పాల్గొన్నారు.

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం