
మట్టికుప్పలు.. పిచ్చిమొక్కలు
అంబారిపేట చౌరస్తా వద్ద బస్ షెల్టర్‌కు అడ్డుగా ఉన్న కర్రలు, మట్టి కుప్పలు
ఇప్పపెల్లిలో బస్ షెల్టర్ వద్ద
పెరిగిన పిచ్చిమొక్కలు
కథలాపూర్(వేములవాడ): గ్రామాల్లో ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్ షెల్టర్లు నిర్మించినా కనీస సౌకర్యాలు లేవు. ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సులు ఎక్కుతున్నారు. మండలంలోని సిరికొండ, తాండ్య్రాల, ఇప్పపెల్లి, పోసానిపేట, అంబారిపేట చౌరస్తా వద్ద బస్ షెల్టర్లు నిర్మించారు. బస్ షెల్టర్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో మల మూత్ర విసర్జన కోసం దూరం వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. అంతలోపే బస్సు వస్తే ఎక్కడమా.. మూత్ర విసర్జనకు వెళ్లడమా అని అవస్థలపాలవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బస్ షెల్టర్లు అపరిశుభ్రంగా ఉండటంతో అందులో నిలబడేందుకు ఇబ్బందులుపడుతున్నారు. బస్సులు వచ్చేవరకు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చొరవచూపి బస్ షెల్టర్లలో సౌకర్యాలు కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.

మట్టికుప్పలు.. పిచ్చిమొక్కలు