
కుక్కల బెడద
కోరుట్లటౌన్: పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో కుక్కల భయంతో వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. రోజూ రాత్రి గ్రౌండ్‌లో 20 నుంచి 30 కుక్కలు నిద్ర పోతున్నాయి. ఉదయం వేళ గ్రౌండ్‌కు వచ్చే వాకర్స్ గుంపుగా ఉన్న కుక్కలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు ఒక్కసారిగా పరిగెత్తడం, రకరకాల విన్యాసాలు చేస్తూ గ్రౌండ్‌లో తిరగడం ఇబ్బందికరంగా మారింది. అలాగే పట్టణ శివారులోని కల్లూర్‌రోడ్ పెట్రోలు బంకు సమీపంలో కుక్కలు గుంపుగా రోడ్డుపై ఉండి వెంటాడుతున్నాయని వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కుక్కల బెడదను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కుక్కల బెడద