
దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు
రాయికల్: దుబాయ్‌లో ఈటీసీఏ ఆధ్వర్యంలో అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. యూఏఈలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేల మంది ప్రవాసీలు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్, అధ్యక్షుడు చీటి జగదీశ్వర్‌రావు, జనరల్ సెక్రటరీ కోట్ల రాణి, ఉపాధ్యక్షుడు అలిగేటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరి శేఖర్‌గౌడ్, కోశాధికారి తిరుమల్ పాల్గొన్నారు.
దుర్గమ్మకు బోనమెత్తిన భవానీలు
ధర్మపురి: దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా భవానీలు ధర్మపురిలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం దుర్గమ్మ బోనాలతో శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం నుంచి నందీకూడలి మీదుగా శోభాయాత్రగా వెళ్లారు. ఉదయం రుద్రాభిషేకం, సరస్వతీపూజలు చేశారు.

దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు