
అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి
పెగడపల్లి: మండలంలోని నామాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఐలయ్య (38) చికిత్స పొదుతూ మృతి చెందాడు. ఈనెల 25న మల్యాలలో జరిగిన ఎన్నికల శిక్షణలో పాల్గొన్న ఆయన అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఐలయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఐలయ్య మృతిపై తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద్‌రావు సానుభూతి తెలిపారు. ఐలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
పోతారంలో వివాహిత అదృశ్యం
మల్యాల: మండలంలోని పోతారానికి చెందిన దాసరి లత అదృశ్యమైనట్లు ఆమె భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. రవీందర్ ఈనెల 25న మర్రిపల్లిలో ఉన్న తన కూతురు ఇంటికి కొడుకుతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికే ఆయన భార్య లత ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రవీందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మంథనిరూరల్: పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌నుంచి అక్రమంగా తరలిస్తున్న యూరియాను అడవిసోమన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకు అడవిసోమన్‌పల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అయితే, సోమవారం ఓ మినీ వాహనంలో సుమారు 50 యూరియా బస్తాలు తరలిస్తుండగా సిబ్బంది తనిఖీ చేశారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని మంథనికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యజమానికి జరిమానా విధించారు.
ఇందిరమ్మ చీరలు ఎక్కడ?
● ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
● బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ప్రజలను విస్మరిస్తోందని, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, రూ.800 బతుకమ్మ చీరలు ఎక్కడిచ్చారని బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రూ.4 వేల పెన్షన్, రైతులకు బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నించారు. మాజీ కౌన్సిలర్ దేవేందర్‌నాయక్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, నాయకులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
మెట్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఐక్యంగా పని చేస్తే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.

అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి

అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి

అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి