
అబుదాబిలో పూలపండుగ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అబుదిబిలోని తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఇండియా అండ్ సోషల్ కల్చర్ వేదికగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో ఉత్సవాలు నిర్వహించారు. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫస్ట్ సెక్రటరీ కమ్యూనిటీ వెల్ఫేర్ కో ఆర్డినేషన్ జార్జీజార్జ్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతినిధులు జయచంద్రన్ నాయర్, షాజీ వీకే, సర్వోత్తమ్ శెట్టి, విజయ్ మానె, దివాకర్ ప్రసాద్, వినాయక్ అవాటె తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, గాయకుడు కోకిల నాగరాజు, యువగాయని సోని యాదర్ల బతుకమ్మ ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఉత్సవ నిర్వాహకులు రాజా శ్రీనివాస్‌రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీశ్, పావని, అర్చన, దీప్తి, పద్మజ ఏర్పాట్లు పర్యవేక్షించారు.