
అల్లీపూర్ మండలం ఏర్పాటు సీఎం దృష్టికి
రాయికల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫాం ఇచ్చే అవకాశం వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 69శాతం సీట్లు కేటాయిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని కిష్టంపేట నుంచి చల్‌గల్, అల్లీపూర్ నుంచి శ్రీరాంనగర్, చెర్లకొండాపూర్ నుంచి మైతాపూర్, ఇటిక్యాల మోడల్‌స్కూల్ వరకు, చింతలూరు నుంచి బషీర్‌పల్లె వరకు రూ.6.30కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నియోకవర్గ అభివృదికి నిరంతరం కృషిచేస్తానన్నారు. బీఫాం ఇచ్చే అవకాశం వస్తే ఆయా సామాజికవర్గాలకు 69 శాతం సీట్లు కేటాయిస్తానన్నారు. అల్లీపూర్‌ను మండలం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, డీటీ రాజరెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, డీఈ మిలింద్, ఏఈ ప్రసాద్, నాయకులు మోర హన్మాండ్లు, గన్నె రాజరెడ్డి, అచ్యుత్‌రావు, కోల శ్రీనివాస్, పడిగెల రవీందర్‌రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు, ఆదిరెడ్డి, దేవుని రవి పాల్గొన్నారు
ఆలయాల అభివృద్దికి కృషి
జగిత్యాలరూరల్: ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పొలాసలోని పౌలేస్తేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ధర్మకర్తల్లో ముగ్గురు పొలాస వాసులు ఉన్నారని తెలిపారు. దామోదర్ రావు, పాలెపు రాజేంద్రప్రసాద్, ధర్మకర్తలు భూమన్న, సత్యనారాయణ, కొండాల్‌రావు, రాజయ్య, వినిత, డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు.