
దంత వైద్యుడి పోస్టు ఖాళీ
రాయికల్: రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి దంతవైద్యుడి పోస్టు మంజూరైంది. ఇక్కడ పనిచేసిన వైద్యురాలిని జిల్లా కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించారు. దీంతో స్థానిక ఆస్పత్రిలో దంతవైద్యం అందకుండాపోతోంది. ఫలితంగా పట్టణంతోపాటు మండలంలోని 32 గ్రామాల బాధితులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రవీణ్‌చంద్ర మోర్తాడ్‌కు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కోరుట్లకు చెందిన లావణ్య రెగ్యులర్ పోస్టుపై వచ్చారు. ఆస్పత్రిలో దంత వైద్యానికి సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి. అయితే లావణ్యను డిప్యూటేషన్‌పై జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో దంత సమస్యలతో బాధపడుతున్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పందించి రాయికల్ ఆస్పత్రికి దంత వైద్య పోస్టు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.