
పేదల సొంతింటి కల తీరుతోంది
జగిత్యాలరూరల్: పేదల సొంతింటి కల సాకా రం అవుతోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం కండ్లపల్లి లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, కండ్లపల్లిని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిందని తెలిపారు. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధి దారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. అదనపు కలెక్టర్ లత, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ వరందన్, డీఈ భాస్కర్, సీఐ సుధాకర్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పొలాసలో రూ.20 లక్షల నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.21లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులకు భూమిపూజ చే శారు. డీఈ మిలింద్, తహసీల్దార్ వరందన్, మా జీ సర్పంచులు,ఏఎంసీ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి
రాయికల్: పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సేవ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సంఘం అధ్యక్షుడిగా మానాల వెంకటి ఎన్నికకాగా.. అభినందించారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని వెంకటి ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించారు. మహేందర్‌బాబు, అజయ్ ఉన్నారు.
పల్లె దవాఖానాలతో మేలు
సారంగాపూర్: పల్లె దవాఖానాలతో ఇంటిముందుకు వైద్యం చేరిందని ఎమ్మెల్యే అన్నారు. బీర్‌పూర్ మండలం తాళ్లధర్మారంలో రూ.20లక్షలతో నిర్మించిన పల్లెదవాఖానా ప్రారంభించారు. 14 మందికి రూ.3.58 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.