
సాంకేతికతతో ఉపాధి అవకాశాలు మెరుగు
జగిత్యాల: సాంకేతికతతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వం యువతకు గ్లోబల్‌స్థాయి నైపుణ్యాలు అందించడమే లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో సుమారు రూ.45 కోట్ల విలువైన ఆధునిక యంత్ర పరికరాలు విద్యార్థుల శిక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. టెక్నాలజీ అవసరం కాబట్టి ఆధునికత సాంకేతిక విద్య అవసరమని, అందుకే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. యువత ఈ కోర్సుల్లో చేరి ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారని, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ను కోరగానే ఏటీసీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 125 మంది విద్యార్థులకు ఇందులో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, ప్రిన్సిపల్ రవీందర్, తహసీల్దార్ వరందన్ పాల్గొన్నారు.
బుగ్గారం అభివృద్ధికి కట్టుబడి ఉంటా..
బుగ్గారం: బుగ్గారం మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుర్గమాతాకు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లను అందించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు.