
ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్
జగిత్యాలటౌన్: ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో లక్ష్మణ్ జయంతిలో పాల్గొన్నారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొండా లక్ష్మణ్ పేరిట ప్రతిభా పురస్కారాలు అందిస్తోందన్నారు. బీసీ సంక్షేమ అధికారి సునీత, డీఎంహెచ్‌వో ప్రమోద్, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ
జగిత్యాలటౌన్: ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శని వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సమష్టిగా బతుక మ్మ ఆడటం ద్వారా ఐక్యత బలపడుతుందన్నా రు. పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకై క పండుగ బతుకమ్మ అన్నారు. అదనపు కలెక్టర్లు ల త, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, ఈడీఎం మమ త, మహిళా అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.