
కొండా లక్ష్మణ్‌ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలి
జగిత్యాలటౌన్: రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి మరువలేనిదని, పదవా..? ప్రాంతమా..? అంటే ప్రాంతమే ముఖ్యమన్న తొలితరం ఉద్యమకారుడైన లక్ష్మణ్‌ను జాతిపితగా గుర్తించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ 109వ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాపూజీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. నాయకులు కల్లెపెల్లి దుర్గయ్య, ఎలి గేటి నర్సయ్య, ఒల్లాల గంగాధర్ పాల్గొన్నారు.