
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రానికి చెందిన పాక శ్రేయాన్ష్ డెండీ లక్షణాలతో శనివారం మృతిచెందాడు. మండల కేంద్రానికి చెందిన పాక మహేశ్–జల దంపతుల కుమారుడు శ్రేయాన్ష్(4)కు వారం రోజుల క్రితం జ్వరం రాగా సిరిసిల్ల లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులు అడ్మిషన్ ఉంచుకున్న వైద్యుడు ఇంటికి పంపగా మళ్లీ జ్వరం వచ్చింది. మరో రోజు ఉంచుకుని కరీంనగర్‌కు పంపించాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బస్టాండులో ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని ప్రభత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఈ నెల 25న బస్టాండ్‌లోని 19వ నంబర్ ఫ్లాట్‌ఫారం వద్ద ఓ వ్యక్తి కిందపడి ఉన్నాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది 108 ద్వారా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను అదే రోజు మృతిచెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపడితే వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
చొప్పదండి: పట్టణంలోని మర్లవాడ శివారులో చొప్పదండి, ధర్మారం హైవేపై జరిగిన రోడ్డు ప్ర మాదంలో పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పెద్దెళ్లి అంజయ్య (42) మృతి చెందాడు. పోలీసు కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి అంజయ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌తో ఓ వ్యక్తి ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులుండగా, భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డెంగీ లక్షణాలతో బాలుడి మృతి