
ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ
వేములవాడ: ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారని.. ఆడబిడ్డలు క్షేమంగా ఉంటేనే బతుకమ్మ క్షేమంగా ఉంటుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్ విమలక్క పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలకు మాజీ సర్పంచ్ నరాల సత్తమ్మపోచెట్టి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్దకు చేరుకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు.
ప్రకృతి క్షేమంగా ఉంటే... ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారు
ఆడబిడ్డలు క్షేమంగా ఉంటే... బతుకమ్మ క్షేమంగా ఉంటుంది
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్ విమలక్క
వేములవాడలో బతుకమ్మ వేడుకలకు హాజరు