
సజావుగా ఎన్నికల ప్రక్రియ
మెట్‌పల్లి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మెట్‌పల్లి మండలం వెల్లుల శివారులోని ఓ గార్డెన్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... సిద్ధంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు. సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. చెక్‌లిస్ట్ ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎంపీడీవోలు మహేశ్వర్‌రెడ్డి, సలీం, శశికుమార్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
మల్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. మల్యాల మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఏఈఈలు, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
కథలాపూర్: ఇంటర్ విద్యార్థుల అభివృద్ధిలో లెక్చరర్లతోపాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి నారాయణ అన్నారు. శుక్రవారం కథలాపూర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ ప్రభు త్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పా టు చేశామన్నారు. ఇక్కడి సీసీ కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి అనుసంధానంగా ఉంటాయని అన్నా రు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుందన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అచ్యుత్‌రాజ్, లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సజావుగా ఎన్నికల ప్రక్రియ