
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం
మల్లాపూర్: మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, డిసెంబర్‌లోపు పునరుద్ధరణ పనులు ప్రా రంభించబోతున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ని ముత్యంపేట శివారులో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి, పునరుద్ధరణ కమిటీ సభ్యుడు జీవన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, అధికారులతో కలిసి బుధవారం సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ, సీఎం రే వంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూడు ఫ్యాక్టరీల్లో మొదటగా ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో 1500 ఎకరాల సాగుతో లక్ష మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుందని, లాభసాటిగా ఉండాలంటే సుమారు 10వేల ఎకరాల వరకు చెరుకు పంటను సాగు చేయాలని, 3.50లక్షల మెట్రిక్ టన్ను ల వరకు ఉత్పిత్తి చేయాల్సిన బాధ్యత రైతులపైనే ఉందన్నారు. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపా ల్ కార్యదర్శి రఘునందన్‌రావు, షుగర్‌కెన్ కమిషనర్ నర్సిరెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.