
సీఎం ఫొటో ఎక్కడ?
ప్రభుత్వం మారింది.. ముఖ్యమంత్రి మా రారు. కానీ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు మాత్రం మారడంలేదు. జిల్లాలోని అధికారుల నిర్లక్ష్యం వెరిసి సీఎం చిత్రపటాలు కనిపించకూండా పోతున్నాయి. జగిత్యాల రూరల్ మండలంలోని హన్మాజీపేట, పొరండ్ల, బాలపల్లి, తిమ్మాపూర్, నర్సింగాపూర్, వంజరిపల్లి, గొల్లపల్లె, చెర్లపల్లె గ్రామపంచాయతీల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో అమర్చలేదు. జగిత్యాల మండల పరిషత్ ఎంపీడీవో విజయలక్ష్మి ఆఫీస్‌లో ఇదే పరిస్థితి. మోతె, హస్నాబాద్, అంబారిపేట, ధరూర్ పంచాయతీ ఆఫీస్‌ల్లో చిత్రపటం పెట్టలేదు. ఈ విషయమై డీపీవో మదన్‌మోహన్‌ను వివరణ కోరగా అన్ని కార్యాలయాల్లో సీఎం ఫొటో ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
– జగిత్యాలరూరల్

సీఎం ఫొటో ఎక్కడ?