
ఏకపక్ష కాల్పులు సరికాదు
నేను, సత్యనారాయణరెడ్డి పెద్దపల్లిలో ఐటీఐ చేశాం. ఇద్దరం క్లాస్‌మెంట్లమే. ఎంతో చురుకై న విద్యార్థి. నేను ఉద్యోగంలో చేరి స్థిరపడ్డాను. ఆయన ఉద్యమంలో చేరారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెబుతున్నా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏకపక్ష కాల్పులకు దిగుతుంది. మావోయిస్టులను అంతం చేయడం కాదు.. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని అంతం చేయాలి.
– దేవీప్రసాద్, కొస క్లాస్‌మెంట్
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగళపల్లె. నేను మావోయిస్టు పార్టీలో 20 ఏళ్లు పని చేశాను. కొస దాదాతో కలిసి చాలా కాలం పని చేశాను. ఎంతో కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి. ప్రజాఉద్యమాలపై పాఠాలు చెప్పేవారు. వనరుల దోపిడీ, పీడిత ప్రజల మౌలిక వసతులు, బహుళజాతి కంపెనీల ఎత్తుగడలను వివరించేవారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తూ దేశమంతటా తిరిగేవారు. ఆయన పార్టీకి ఓ లెజెండ్. – నేరెళ్ల జ్యోతి,
మాజీ మావోయిస్టు, శివంగాళపల్లె
మాది పెద్దపల్లి పక్కన ఓ పల్లె. మా అన్న లచ్చిరెడ్డి అలియాస్ సూరన్న తొలితరం దళనేత. సూరన్నతో కలిసి సత్యనారాయణరెడ్డి ప్రజా ఉద్యమాల్లోకి వెళ్లాడు. నిజానికి 1980లో తొలిసారి ఆదివాసీ ప్రాంతాల్లో సాయుధపోరాటాన్ని నడిపించిన మొదటి వ్యక్తి కొస. దండకారణ్యంలో ఆదివాసీ సమస్యలపై పోరాటం చేస్తూ, అక్కడి ప్రజలను ఏకం చేశారు. ఆయన స్ఫూర్తితోనే మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో నాలుగున్నర దశాబ్దాలుగా మనుగడ సాధించింది.
– కంది చొక్కారెడ్డి, పెద్దపల్లి

ఏకపక్ష కాల్పులు సరికాదు

ఏకపక్ష కాల్పులు సరికాదు