
రైతులకు అండగా ప్రభుత్వం
జగిత్యాలరూరల్: రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఈజీఎస్ నిధులు జగిత్యాలకు మంజూరయ్యాయని తెలిపారు. యూరియా కొరతతకు అనేక కారణాలున్నాయని, కేంద్రాన్ని విమర్శించి రాజకీయం చేయడం అవసరం లేదన్నారు. పంచాయతీరాజ్ ఈఈ లక్ష్మణ్‌రావు, ఎంపీడీవో రమాదేవి, డీఈ మిలింద్, ఎంపీవో రవిబాబు, ఎంఈవో గంగాధర్ పాల్గొన్నారు. అంతకుముందు పొలాసలోని పౌలస్తేశ్వరస్వామి ఆలయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. యాదవ యువజన సంఘం భవనానికి నిధులు మంజూరు చేయాలని అఖిల భారత యాదవ మహాసంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.